VIDEO: లవర్ ముందే యువకుడు సూ*సైడ్.. ఎందుకంటే?

ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 19 ఏళ్ల యువతితో ఓ చెట్టు కింద మాట్లాడుతున్నాడు. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని, పెళ్లి కుదరదని యువతి చెప్పడంతో ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకేశాడు. కాపాడేందుకు యువతి సైతం దూకింది.

New Update
boyfriend jumping into pond

తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తిరువారూరుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 19 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ ఓ చెట్టు కింద మాట్లాడుకుంటుండగా, యువతి పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, వారికి వేరే పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పింది.

ఈ మాట విన్న ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే పరుగు పరుగున వెళ్లి సమీపంలోని చెరువులోకి దూకేశాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం చూసిన ఆ యువతి కూడా వెంటనే అతడిని కాపాడేందుకు కొలనులోకి దూకింది. స్థానికులు వారిని బయటకు తీయగా ప్రవీణ్ అప్పటికే చనిపోయాడు. యువతి ప్రాణాలతో బయటపడింది.

యువకుడు చెరువులో దూకడం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిద్దరినీ బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ప్రవీణ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. యువతిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు.

ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందే ప్రియుడు చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం, అతడిని కాపాడటానికి ఆమె కూడా ప్రయత్నించడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమ విఫలమైతే జీవితాన్ని అంతం చేసుకోవాలనే యువతరం ఆలోచన తీరుపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Advertisment
తాజా కథనాలు