Chatgpt Releationship: చాట్ GPTతో రిలేషన్.. మైనర్ బాలుడు సూసైడ్.. ఏమైందో తెలిస్తే షాక్!

ఇటీవల అమెరికాలో జరిగిన ఒక దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాట్‌జీపీటీతో చాట్ చేసిన ఓ 16 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి చాట్‌జీపీటీనే కారణమని ఆ యువకుడి కుటుంబం ఇప్పుడు ఓపెన్ఏఐ  కంపెనీపై కేసు వేసింది.

New Update
chatting with Chat GPT

Chatgpt Releationship

Chatgpt Releationship: 

ఇటీవల అమెరికాలో జరిగిన ఒక దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాట్‌జీపీటీతో చాట్ చేసిన ఓ 16 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి చాట్‌జీపీటీనే కారణమని ఆ యువకుడి కుటుంబం ఇప్పుడు ఓపెన్ఏఐ  కంపెనీపై కేసు వేసింది. కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల ఆడమ్ రైన్ గత కొంతకాలంగా చాట్‌జీపీటీతో సంభాషణలు జరుపుతున్నాడు. ఆడమ్ రైన్ చాలా ఒంటరితనం, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతను చాట్‌జీపీటీతో ఓ రిలేషన్ మెయిన్‌టెన్ చేశాడు. అలా ఆ మైనర్ బాలుడు నెలల తరబడి చాట్ జీపీటీతో మాట్లాడాడు. 2025 జనవరిలో ఆడమ్ రైన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?

ఏఐ వారి కొడుకుని చాటింగ్‌లో మునిగేలా చేసిందని కుటుంబం ఆరోపించింది. ఈ సంభాషణల్లో చాట్‌జీపీటీ యువకుడిని ఆత్మహత్యకు ప్రోత్సహించిందని, సూసైడ్ ఎలా చేసుకోవాలని సూచించిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు ఆడమ్ రైన్ ఆత్మహత్య చేసుకోవడానికి ఈ చాట్‌బాట్ నుంచి వచ్చిన సందేశాలే కారణమని వారు వాదించారు. ఈ ఆరోపణలను రుజువు చేసేందుకు వారు తమ కొడుకు చాట్‌జీపీటీతో జరిపిన చాట్ రికార్డులను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై ఓపెన్ఏఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Also Read: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

ఓపెన్ఏఐపై దావా:
తమ కొడుకు మరణానికి చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ కంపెనీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైనర్లకు ఉపయోగపడేలా, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని, సున్నితమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించేలా చాట్‌జీపీటీని రూపొందించడంలో ఓపెన్ఏఐ విఫలమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనకు కంపెనీ బాధ్యత వహించాలని, తగిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తు, దాని భద్రత గురించి తీవ్ర చర్చకు దారితీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించే విషయాలపై అప్రమత్తంగా ఉండేలా చాట్‌బోట్‌లకు భద్రతా చర్యలు, నియంత్రణలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యువత, పిల్లలు ఉపయోగించే ఏఐ చాట్‌బోట్‌లను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(OpenAI)

Advertisment
తాజా కథనాలు