/rtv/media/media_files/2025/12/23/fotojet-21-2025-12-23-08-54-44.jpg)
love failure
Crime News : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్మాస్ గూడ ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీలో ఉంటున్న అంబాదళ అశోక్, రూప అనేద దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక కూతురు విహారిక అబ్దుల్లాపూర్‌మెట్ లోని ఓ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. విహారిక అల్మాస్‌గూడ రాజీవ్‌గృహకల్పకు చెందిన డెకరేషన్ పనిచేసే జై కిషోర్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జైకిషోర్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విహారిక డిసెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిపోయింది. డిసెంబర్ 18న విహారికను తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు జైకృష్ణ.
పెళ్లి చేసుకోవాలని విహారిక తల్లిదండ్రులు కోరినా జై కృష్ణ నిరాకరించాడు. ఆదివారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూసిన విహారిక నిద్రించేందుకు తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయే ముందు ఫోన్‌లో వాట్సప్ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
‘మనం ఒకరినొకరం సరిగ్గా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తు ఫెయిల్ అయ్యింది. నేను వెళ్లిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మనం ఒక దగ్గర ఉండలేం. ఇదే నా చివరి సంక్షిప్త సమాచారం,సారీ మై బాయ్..’ అంటూ ఇంగ్లీసులో వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. వారి ప్రేమను అంగీకరించినప్పటికీ అతడి ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసిందని, అతడు వేధించడంతో పాటు తమను బెదిరించాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే కన్నకూతురు విఘత జీవిగా ఉండటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
Follow Us