Australia: మంధాన సెంచరీ వృథా.. మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ఆసీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. మూడుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మూడోవన్డేలో ఆసీస్ 83పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధన సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు.