Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అభిమానులకు డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటవల అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కాంబ్లీ.. వే కోలుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు స్వయంగా బెడ్ పైనుంచి లేచి నడవటంతోపాటు తమతో ఆడిపాడుతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ 'చక్ దే ఇండియా' సాంగ్ కు హాస్పిటల్ స్టాఫ్ తో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేసిన ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా కాంబ్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Vinod Kambli danced in the hospital😀 #VinodKambli pic.twitter.com/uYxnZMbY1u
— Cricket Skyblogs.in (@SkyblogsI) December 31, 2024
సచిన్, కపిల్ ఆర్థిక సహాయం..
ఇక మూత్ర ఇన్‌ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కాంబ్లీ ఇటీవలే ఠాణే ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టిందని వెల్లడించారు. అయితే దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయన బాడీ చికిత్సకు సహకరిస్తుందని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వైద్య బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే.. వైద్యం చేయించుకునేందుకు కాంబ్లీకి ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్ననాటి స్నేహితుడు సచిన్, కపిల్ దేవ్, బీసీసీఐ కలిసి వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. సచిన్ తోకలిసి ఇండియాకు ఎన్నో రికార్డులు తెచ్చిపెట్టిన కాంబ్లీ.. చెడు అలవాట్ల కారణంగా వ్యసనాల బారిన పడి క్రికెట్ కు దూరమయ్యారు.
ఇది కూడా చదవండి: న్యూ ఇయర్‌లో రానున్న కొత్త రూల్స్ ఇవే!
ఇది కూడా చదవండి: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు