CP: వాళ్లు నన్ను ట్రోల్ చేస్తారు.. భారత టీమ్‌పై సీవీ ఆనంద్ సెటైర్లు!

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ నెటిజన్లతో చేసిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా 11 మందితో ఆడితే ఇండియా 9మందితో పోటీపడుతోందని సెటైర్లు వేశారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లతో ప్రయోజనం లేదని, వారి పేరు చెబితే వాళ్ల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారన్నారు.

author-image
By srinivas
New Update
Cp Cv Aanand Comments on Team India

Cp Cv Aanand Comments on Team India

CP Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ నెటిజన్లతో చేసిన ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ వైరల్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శనపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్స్ భారంగా మారారని, కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే భారత్ ఆటతీరుపై సీవీ ఆనంద్ అభిప్రాయం తెలుసుకోవాలని ఉందంటూ ఓ నెటిజన్‌లు పోస్ట్ పెట్టాడు. దీంతో తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన సీపీ.. ఆస్ట్రేలియా 11 మందితో ఆడితే టీమ్ ఇండియా కేవలం 9మందితో పోటీపడిలే ఎలా అంటూ సెటైర్లు వేయడం విశేషం.

Also Read: అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?

 

జీర్ణించుకోవడం చాలా కష్టం..

ఈ మేరకు 'అగ్రశ్రేణి జట్ల చేతిలో దారుణంగా ఓడిపోతున్నాం. జీర్ణించుకోవడం చాలా కష్టం. గత పర్యటనలో స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియాను ఓడించారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నా ప్రయోజనం లేదు. నేను వారి పేరు చెప్పలేను. ఎందుకంటే వారి 'సోషల్ మీడియా ఆర్మీలు' నన్ను ట్రోల్ చేస్తాయి' అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.

Also Read: Kambli: ‘చక్‌ దే ఇండియా’ పాటకు స్టెప్పులేసిన కాంబ్లీ.. వీడియో వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు