టీమిండియా ప్లేయర్స్ హోటల్‌ రూమ్స్‌లో కూర్చోకండి: సునీల్ గావస్కర్

టీమిండియా ప్లేయర్లకు సునీల్ గావస్కర్ ఇంట్రెస్టింగ్ సూచనలు చేశారు. అడిలైడ్ టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు హోటల్‌ గదుల్లో కూర్చోకుండా ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనాలని కోరారు. దీనిపై కెప్టెన్, కోచ్ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

New Update
Sunil Gavaskar

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండు టెస్టులు ఉత్కంఠగా సాగాయి. భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా ఓవల్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. 

ఇది కూడా చూడండి: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ఈ విన్నింగ్‌తో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఈక్వెల్ చేసింది. ఇక మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఈ తరుణంలో టీమిండియా స్టార్ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు టీమిండియా ప్లేయర్లకు కీలక సూచనలు అందించారు. 

ఇది కూడా చూడండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

హూటల్ రూమ్‌లో కూర్చోకండి

ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్ అని మర్చిపోయి.. మిగిలిన సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా భావించండని కోరారు. ఇది చాలా విలువైన సమయం అని.. ఆ సమయాన్ని వృధా చేయకండని సూచించారు. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. కాబట్టి మిగిలిన రెండు రోజులను ప్రాక్టిస్ కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇందులో భాగంగా తనకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్‌పై నమ్మకం లేదని తెలిపారు. టీమిండియా జట్టు రాబోయే రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మీరు క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చారు.. కాబట్టి హోటల్ రూమ్స్‌లో కూర్చోకుండా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. అయితే రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని.. కేవలం ఉదయం కానీ, సాయంత్రం కానీ నచ్చిన సమయంలో ఒక సెషన్ పాటు ప్రాక్టీస్ చేయండని అన్నారు. 

ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

అదే సమయంలో టీమిండియా బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయడంలో విఫలం అయ్యారని.. అందువల్ల లయలోకి రావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్‌లోని ప్లేయర్లకు ప్రాక్టీస్ చాలా అవసరమన్నారు. అదే సమయంలో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్‌పై తనకు నమ్మకం లేదన్నారు. దీనిపై కెప్టెన్, కోచ్ ఫోకస్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అయితే బాగా ఆడిన బ్యాటర్లకు, అధిక ఓవర్లు వేసిన బౌలర్లకు ఈ మినహాయింపు ఇవ్వొచ్చన్నారు. ప్లేయర్స్ అందరూ సాధన చేయాలని అన్నారు. అయితే కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి ప్లేయర్లు ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు. వారు చాలా అనుభవం ఉన్నవారు. కానీ మిగతా ప్లేయర్లు ప్రాక్టీస్ చేయాలి అని సునీల్ గావస్కర్ అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు