బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దు.. పాంటింగ్ సంచలన కామెంట్స్!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ కష్టమైన పని అన్నాడు. ఒత్తిడికి గురిచేయొద్దన్నాడు.

author-image
By srinivas
New Update
dre

Ricky Ponting: భారత ఫాస్ట్ బౌలర్ జస్ర్పిత్ బుమ్రాకు అనవసర బాధ్యతలు అప్పగించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పటికే భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు.. కెప్టెన్సీ కష్టమైన పనేనని అన్నాడు. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఓ సమావేశంలో మాట్లాడిన పాటింగ్ కీలక సూచనలు చేశాడు. 

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

కెప్టెన్‌గా పూర్తి బౌలింగ్‌ చేయగలడా?

ఈ మేరకు తొలి టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చనే కామెంట్స్ పై మాట్లాడిన పాటింగ్.. రోహిత్ ఆడకపోతే బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కానీ అది తనకు కష్టంగా ఉండొచ్చు. కమిన్స్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ అయినప్పుడు కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. కెప్టెన్‌గా పూర్తి బౌలింగ్‌ చేయగలడా? లేదా అనే ప్రశ్నల తలెత్తాయి. అయితే బుమ్రా లాంటి అనుభవజ్ఞుడికి అనవసరమైన భారం ఎత్తకూడదు. అతని అనుభవం బౌలింగ్ విభాగానికి వదిలేయాలి. కెప్టెన్ గా మరొకరిని ఎంచుకుంటే బాగుంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు పాంటింగ్. 

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

Advertisment
Advertisment
తాజా కథనాలు