/rtv/media/media_files/2024/12/24/NoM9WrYRKMMB7MQcLwSa.jpg)
Rohit Sharma responds to his knee injury
భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికి మూడు టెస్టులు జరగగా అందులో టీమిండియా 1 మ్యాచ్ గెలవగా.. ఆసీస్ 1 మ్యాచ్ గెలుపొందింది. ఇలా 1-1 తేడాతో సమానంగా ఉన్నాయి. ఇక రీసెంట్‌గా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. త్వరలో అంటే డిసెంబర్ 26 నుంచి నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Also Read: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!
నెట్ ప్రాక్టీస్‌లో మోకాలికి గాయం
నెట్‌లో ప్రాక్టిస్ చేస్తూ చెమటోడుస్తున్నాయి. ఇందులో భాగంగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. అతని మోకాలికి బంతి తగిలి తీవ్ర గాయమైంది. అయినా అతడు ప్రాక్టీస్ ఆపలేదు. అలాగే కొనసాగించాడు. అనంతరం ఫిజియోతో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
అదే సమయంలో గాయం కారణంగా రోహిత్ శర్మ నాలుగో టెస్ట్‌కు దూరం అవుతున్నట్లు వార్తలు జోరుగా ప్రసారమయ్యాయి. నెట్టింట పోస్టులు చక్కర్లు కొట్టాయి. అభిమానులు కలవరపడ్డారు. ఈ తరుణంలో రోహిత్ స్పందించాడు. తన మోకాలికి గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. అంతేకాకుండా తాను చేసే బ్యాటింగ్ స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?
మోకాలు బాగానే ఉంది: రోహిత్
తన మోకాలు బాగానే ఉందన్నాడు. అది తీవ్రమైన గాయం కాదని పేర్కొన్నాడు. అయితే ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారో చింతించాల్సిన అవసరం లేదన్నాడు. టీంకు ఏది సరైనదో అదే చేస్తామని చెప్పుకొచ్చాడు. కొన్ని విషయాలు బయటకు చెప్పాలి.. మరికొన్ని విషయాలు చెప్పకూడదన్నాడు. ఇక ఆఫ్ స్టంప్ బలహీనతను అదగమించేందుకు కోహ్లీ ప్రయత్నం చేస్తున్నాడని తెలిపాడు. అలాగే జైస్వాల్ మా అందరికంటే తన బ్యాటింగ్‌ను బాగా అర్థం చేసుకున్నాడన్నాడు. జైస్వాల్ స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహిస్తాం అని చెప్పుకొచ్చాడు.