T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. దక్షిణా బౌలర్ల మీద విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు.దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. By Manogna alamuru 13 Nov 2024 | నవీకరించబడింది పై 14 Nov 2024 01:41 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి సౌతాఫ్రికా vs భారత్: తిలక్ వర్మ, అభిషేక్ వర్మ...దక్షిణా ఆప్రికా బౌలర్లను గడగడలాడించారు. ఒకరు సెంచరీతో, మరొకరు హాప్ సెంచరీతో పరుగుల వరద పారించారు. సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బరిలోకి దిగిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేశాడు. ఒకవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ మొదలైన తర్వాత మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ మొదలు పెట్టాడు. ఇతనికి అభిషేక్ వర్మ కూడా తోడందించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కి 107 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. అభిషేక్ శర్మ 24 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న వెంటనే..తరువాతి బాల్ కే వెనురిగాడు. దీంతో తిలక్, అభిషేక్ పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరు తిలక్ వర్మకు పెద్దగా సపోర్ట్ అందించలేదు. అయినా కూడా తన సెంచురీని పూర్తి చేసుకున్నాడు తిలక్ వర్మ. దీంతో టీమిండియా...నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. Also Read: Movies: సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన తిలక్ వర్మ తన టీ20 కెరియర్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 51 బంతుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. మొత్తానికి తిలక్ వర్మ 56 బంతులతో 107 పరుగులు చేశాడు. మరోవైపు వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు.. అందిలే సిమెలనే, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మార్కో జాన్సెన్ ఒక వికెట్ ను తీసుకున్నాడు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. స్టేడియంలోకి పురుగుల దండు దాడి చేయడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. పురుగులను చెదరగొట్టాక మళ్ళీ ఆట మొదలైంది. Also Read: MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? #cricket #t20 #south-africa #tilak-varma #sports-news #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి