Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా సోనూ సూద్! ఫోన్ లో ఏం చెప్పారంటే
నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్. ఇటీవలే కిడ్నీ సమస్యలతో మృతిచెందిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.