/rtv/media/media_files/2025/12/18/sonu-sood-2025-12-18-11-27-55.jpg)
Sonu Sood
Sonu Sood: సోషల్ మీడియాలో సోను సూద్ తాజాగా షేర్ చేసిన జిమ్ ఫోటోలు ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఆయన ఫిట్‌నెస్‌కి పెట్టే శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఫోటోలో, స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి బైసెప్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ కనిపించారు. ఆయన చేతులు బలంగా, అబ్స్ స్పష్టంగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. జిమ్ లో తీసిన ఈ ఫోటో చుస్తే ఆయన హార్డ్ వర్క్ అర్థమవుతోంది.
— sonu sood (@SonuSood) December 18, 2025
మరొక ఫోటోలో, సోను నిలబడి పొస్ తో తన ఫిట్ అయిన శరీరాన్ని ప్రదర్శించారు. ఈ ఫోటోలు చూస్తే, ఆయన ఫిట్‌నెస్‌ను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో అర్థమవుతుంది.
52 ఏళ్ల వయసులో కూడా సోను సూద్ ఇలా ఫిట్‌గా ఉండటం నిజంగా ఆశ్చర్యం. వయసు అనేది ఆరోగ్యానికి అడ్డంకి కాదని ఆయన మరోసారి నిరూపించారు. ఆయన శరీరాకృతి చూసి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇన్స్పిరేషన్”, “ఫిట్‌నెస్ గోల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోను సూద్ సినిమాల ద్వారానే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సేవలు కావచ్చు, ఇప్పుడు ఫిట్‌నెస్ విషయంలో చూపిస్తున్న నిబద్ధత కావచ్చు, ప్రతి విషయంలోనూ ఆయన ప్రజలకు ప్రేరణగా మారుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, మన శరీరాన్ని మనమే చూసుకోవాలి అనే సందేశాన్ని సోను సూద్ తన చర్యల ద్వారా చెబుతున్నారు. జిమ్‌లో చేసే కష్టాన్ని, డిసిప్లిన్‌ను ఈ ఫోటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
మొత్తానికి, సోను సూద్ తాజా జిమ్ పిక్స్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా ఉండొచ్చని, కష్టపడితే మంచి ఫలితం వస్తుందని ఆయన మరోసారి చూపించారు.
Follow Us