/rtv/media/media_files/2025/07/21/sonu-sood-help-to-fish-venkat-family-2025-07-21-16-02-54.jpg)
sonu sood help to fish venkat family
Sonu Sood: నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్. ఇటీవలే కిడ్నీ సమస్యలతో మృతిచెందిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్వయంగా ఫోన్ చేసి ఫిష్ వెంకట్ భార్యను పరామర్శించారు. ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న ఆ కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సహాయం అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని.. ఇండియా వచ్చిన వెంటనే కలుస్తానని చెప్పారు.
Also Read : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం...ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్
ఎవరూ రాలేదు!
ఇదిలా ఉంటే.. ఫిష్ వెంకట్ చనిపోయిన తర్వాత అతడి ఫ్యామిలీని పరామర్శించడానికి టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరో, డైరెక్టర్, నిర్మాత కూడా వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. కనీసం ఆయన చివరిచూపునకు కూడా ఎవరూ వెళ్ళకపోవడం బాధాకరం! ఈ క్రమంలో సోనూ సూద్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం, ఆర్ధిక సహాయం అందించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : ఓరి దేవుడా.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?- ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కిడ్నీ ఫెల్యూర్ తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వెంకట్ కు ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఫిష్ వెంకట్ కుటుంబం దాదాపు నెలరోజుల పాటు ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూసింది. టాలీవుడ్ పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే ఆయన బతుకుతారని వేడుకున్నారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్, హీరో విశ్వక్ సేన్ వంటి పలువురు తమవంతు ఆర్థిక సాయం అందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రూ. రెండు లక్షల వరకు సాయం చేశారు. కానీ చివరకు పరిస్థితి విషమించడంతో జులై 18న ఆయన కన్నుమూశారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో కీలక ప్రకటన
Also Read : ఏళ్ళు గడిచినా తగ్గని గ్లామర్.. బికినీలో సీనియర్ నటి హాట్ షో!
sonu-sood | fish venkat | cinema-news