Viral Video: పాముని పట్టుకున్న సోనూసూద్.. వీడియో వైరల్

సోనూసూద్ ముంబయిలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన పామును చేతులతో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఆ పాము ర్యాట్‌ స్నేక్‌ అని, విషపూరితం కాదని వీడియోలో వివరించారు. ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

New Update
sonu sood

సూనూసూద్‌.. అంటే ఈ పేరు తెలియని వారు అంటూ దాదాపు ఎవరూ ఉండదు. ఆయన సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తుండాడు. కానీ బయట రియల్ హీరోలా ప్రజా సేవ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు సోనూసూద్. సహసం, సాయం చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా మరోసారి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ముంబయిలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన పామును చేతులతో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఆ పాము ర్యాట్‌ స్నేక్‌ అని, విషపూరితం కాదని వీడియోలో వివరించారు. ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు స్నేక్ క్యాచర్స్‌ను మాత్రమే పిలిపించి పట్టుకోవాలన్నారు. అనంతరం సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు సోనూ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

,

Advertisment
Advertisment
తాజా కథనాలు