Sonu Sood : బాక్సాఫీస్‌ విజయం కంటే బాధలు తీర్చడంలోనే మజా

బాక్సాఫీస్‌ ఘన విజయాల కంటే సామాన్యుల బాధలు తీర్చడం లోనే సంతృప్తి చెందుతానని, వారికి అందించే సేవ గొప్పదని ప్రముఖ నటుడు సోనూసూద్‌ అన్నారు. ఆయన కొవిడ్‌ సమయంలో అందించిన సేవలకు గాను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిష్ఠాత్మక మానవతావాది అవార్డును ప్రదానం చేసింది.

New Update
Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా?

Sonu Sood

బాక్సాఫీస్‌ ఘన విజయాల కంటే సామాన్యుల బాధలు తీర్చడం లోనే సంతృప్తి చెందుతానని, వారికి అందించే సేవ గొప్పదని ప్రముఖ నటుడు సోనూసూద్‌ అన్నారు. కొవిడ్‌ సమయంలో తను అందించిన సేవలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.  హైదరాబాద్‌ లో జరుగుతున్న  మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్స్‌ వేడుకలకు బాలీవుడ్‌ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కాగా ఆయన కొవిడ్‌ 19 సమయంలో అందించిన సేవలకు గాను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిష్ఠాత్మక మానవతావాది అవార్డును ప్రదానం చేసింది.

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

Also Read :  ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!

Sonu Sood

మరో అతిథి టాలీవుడ్‌ నటుడు దగ్గుబాటి రానా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వలస కార్మికులు, విద్యార్థులు, పేద కుటుంబాలకు సహాయం చేస్తూ.. ప్రపంచ సంక్షోభ సమయంలో సోనూ ఎన్నో సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత  సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా విద్య, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, నిరుపేదల సాధికారతపై పనిచేస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. ఆర్థికంగా లేని పేద మహిళలకు ఉచితంగా అవసరమైన శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. కాగా ఆయన సేవలకు గాను ఈ ఫౌండేషన్‌కు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఐదేళ్లపాటు విదేశీ సహకార నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్‌ కూడా  మంజూరు చేసింది. దీంతో ఈ ఫౌండేషన్‌తో మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ‘బ్యూటీ విత్‌ ఏ ప్రాజెక్ట్‌’ కోసం చేతులు కలిపింది. క్యాన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇరు సంస్థలు చేపట్టడానికి చేతులు కలిపాయి.

Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
 
ఈ సందర్బంగా సోనూసూద్‌ సేవలను మిస్‌ వరల్డ్‌ మొట్టమొదటి గ్లోబల్‌ అంబాసిడర్‌గా నియమితురాలైన ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ సుధారెడ్డి ప్రశంచించారు.  సోనూ అనేక సేవా, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మిస్‌ వరల్డ్  సీఈవో జూలియా మోర్లే ప్రశంసించారు.

Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

 

covid-19 | sonu-sood | Miss World 2025 hyderabad | miss world 2025 | Miss World Contestants | Miss World 2025 Contest | miss world contestant | miss world in hyderabad

Advertisment
Advertisment
తాజా కథనాలు