Bangladesh: పాకిస్తాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు పడుతుంది..షేక్ హసీనా కొడుకు సంచలన వ్యాఖ్యలు
దేశంలో శాంతి భద్రతలు వెంటనే నెలకొల్పకపోతే తమ పరిస్థితి కూడా పాకిస్తాన్‌లానే తయారవుతుందని అన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన కామెంట్ చేశారు.