HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో)

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. 

New Update
ecil murder

ecil murder Photograph: (ecil murder)

HYD CRIME: హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా అతను చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. 

వెనకాలే బైక్ పై ఫాలో అయిన కొడుకు..

అయితే లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45), అతని కొడుకు సాయి కుమార్ (25) ఇద్దరూ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పనిచేస్తున్నారు. కొంతకాలంగా కుటుంబంలో కలహాలు, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. అలాగే మొగిలి మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండగా సాయికుమార్‌ విసిగిపోయాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న సాయి.. లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా అతని వెనకాలే బైక్ పై ఫాలో అయ్యాడు. ECIL బస్‌ టెర్మినల్‌ వద్ద బస్సు దిగగానే తండ్రిని చాకుతో విచక్షణారహితగా పొడిచాడు. స్థానికులు దగ్గరలోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Local Boy Nani: యూట్యూబర్‌ లోకల్‌బాయ్‌ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Illegal Activities In SPA: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. కండోమ్‌లతో నిండిన గదులు.. 23 మంది అరెస్టు!

ఇక తండ్రిని చంపిన సాయి ఎవరికో ఫోన్ చేసి గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు. వాడ్ని చంపేశాను. నేనే చంపేశాను. నా చేతులతో పొడిచి పొడిచి చంపేశాను అంటూ అరిచాడు. చుట్టుపక్కల చూస్తున్న జనంలో ఒకరి ఆ కుర్రాడ్ని ఎందుకిలా చేశాని అడగగా.. వాడు బతకడానికి వీల్లేదు. వాడు చావాల్సిందే. వాడు మా నాన్నే. నేను వాడికి కొడుకునే. అందుకే చంపేశానని అన్నాడు. కన్నకొడుకే తండ్రిని ఇంత క్రూరంగా, దారుణంగా చంపేస్తుంటే జనాలు షాక్ కు గురయ్యారు. 

Advertisment
తాజా కథనాలు