/rtv/media/media_files/2025/01/09/0C3Rzgg9zj4hZImmlpJ7.jpg)
biden son
America: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో రగులుకున్న కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోనే సంపన్నుల నగరమైన లాస్ ఏంజెల్స్ కాలి బూడిదైపోతుంది.ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్‌తోపాటు బిలియనీర్లు నివసిస్తారు. దీంతో మంటల్లో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిద అవుతున్నాయి.
Also Read: CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్!
హంటర్ బైడెన్ నివాసం..
ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు సమాచారం. మాలిబులోని హంటర్ బైడెన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన మాన్షన్ పూర్తిగా కాలిపోయింది. ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు సైతం కాలి బూడిదైపోయింది.
Also Read: Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి
Hunter Biden's Malibu home burned to the ground by LA fire.#HollywoodFire pic.twitter.com/pk830mYEJx
— Pat López Carrere (@LopezCarrere) January 9, 2025
ఈ మాన్షన్ ఖరీదు 15,800 అమెరికా డాలర్లుగా తెలుస్తోంది. మాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల మంగళ, బుధవారాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు బారిన పడి ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందగా, చాలామంది గాయపడ్డారు.
Hunter Biden's Malibu home burned to the ground by LA fire.#HollywoodFire pic.twitter.com/pk830mYEJx
— Pat López Carrere (@LopezCarrere) January 9, 2025
3 వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10 వేలకు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకోగా అందులో వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజెల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంటోని మార్రోన్ తెలిపారు. ఈ ప్రమాదంలో శాంటామోనికా ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆలముకుంది.
🔥 #Wildfire Hits LA Districts, Firefighters Face Challenges
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) January 8, 2025
A wildfire in Pacific Palisades grows to 1,261 acres, with footage spreading on social media. #LosAngeles #US #Sputnik pic.twitter.com/SpFBqeNoiU
ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతికి ఉంటే చాలు అంటూ బయటపడ్డారు. ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలియనీర్లతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీ జేమ్స్ ఉడ్స్, స్టీవ్ గుటెన్‌బర్గ్ కూడా ఉన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Also Read: Game Changer: దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎన్ని కోట్లంటే!
Also Read: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే