బీఆర్ఎస్ నేత కేటీఆర్ పుట్టినరోజు జులైలో జరిగింది. అప్పుడు ఆయన కోసం కొడుకు హిమాన్ష్ ఒక పాట పాడి గిఫ్ట్‌గా ఇచ్చారు. దానిని తాజాగా కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే... నాన్నా..’’ అంటూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హిమాన్షు.. పాట పాడుతూ వీడియో రికార్డ్ చేశారు. అయితే.. అప్పుడు కవిత అరెస్ట్ తో కేసీర్, కేటీఆర్ యే కాకుండా అందరూ టెన్షన్‌లో ఉన్నారు. అలాంటి సందర్భంలో వీడియోను రిలీజ్ చేయడం సరికాదని హిమాన్షు భావించారు. అందుకు ఇప్పుడు దానిని అందరితో పంచుకుటున్నాను అంటూ కేటీఆర్ కొడుకు పాడిన పాటను షేర్ చేశారు. ఈ విషయం తనకు వారం రోజుల క్రితమే తెలిసిందని చెప్పారు. కాస్త కష్టంగా సాగిన ఈ ఏడాదిలో ఈ వీడియో నాకు ఉత్తమ బహుమతి. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా అని కేటీఆర్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Also Read: BCCI:నితీశ్ రెడ్డికి పేరెంట్స్ సర్‌ప్రైజ్..వీడియో షేర్ చేసిన బీసీసీఐ