Ex Minister Sheikh Hasina Son: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోగ్యంగా ఉన్నారని..నా సోదరి ఆమెతో ఉందని చెప్పారు ఆమె కుమారుడు సజీబ్. కానీ మాజీ ప్రధాని చాలా బాధపడుతున్నారని సజీబ్ వాజెద్ జాయ్ డ్యూష్ విల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.దేశం కోసం బంగాబంధువులు తమ జీవితాన్ని త్యాగం చేయడం తనను కలచివేసిందన్నారు. గత ఒకటిన్నర దశాబ్దంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ, ఆమెను బయటకు విసిరేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా శాంతిభద్రతలను పునరుద్ధరించకుంటే పాకిస్థాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు కూడా వస్తుందని షేక్ హసీనా కుమారుడు అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన అన్నారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Bangladesh: పాకిస్తాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు పడుతుంది..షేక్ హసీనా కొడుకు సంచలన వ్యాఖ్యలు
దేశంలో శాంతి భద్రతలు వెంటనే నెలకొల్పకపోతే తమ పరిస్థితి కూడా పాకిస్తాన్‌లానే తయారవుతుందని అన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన కామెంట్ చేశారు.
Translate this News: