Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
పాకిస్తాన్‌లోని సింధు డెల్టా ప్రాంతంలోకి సముద్రపు ఉప్పు నీరు రావడంతో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగు వైపుల నుంచి ఈ నీరు రావడంతో రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
అదొక అందమైన దేశం. నాలుగు వైపులా నీళ్ళు మధ్యలో భూమి ఉండే బుల్లి ద్వీపం. మూడు వేల ఏళ్ళ నుంచి ఉంటున్న ఈ ద్వీప దేశం మరికొన్నేళ్ళల్లో మాయం అయిపోనుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా పూర్తిగా కనుమరుగు కానుంది.
థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోనే పోలీస్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో అధికారులు, పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నారు. పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది.
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు..
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది.
చైనా సముద్రంలో షిప్‌పై నుంచి రాకెట్ లాంచ్ చేసింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది.
ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది.