నడి సముద్రం నుంచి చైనా రాకెట్ ప్రయోగం

చైనా సముద్రంలో షిప్‌పై నుంచి రాకెట్ లాంచ్ చేసింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది.

New Update
china rocket

china rocket Photograph: (china rocket)

చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయిని చేరింది. నడి సముద్రంలో షిప్‌పై నుంచి తక్కువ వంపు కక్ష్యలోకి రాకెట్‌ను ప్రయోగించిన దేశంగా రికార్డ్ సృష్టించింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది. దీని పొడవు 31 మీటర్లు, 140 టన్నుల బరువు.

ఈ కమర్షియల్ క్యారియర్ రాకెట్‌ను జనవరి 13న షాన్‌డాండ్ ప్రావిన్స్ ‌లోని హైయాంగ్ సమీపంలోని సముద్ర నీటి మధ్య నుంచి కక్ష్యలోకి ప్రయోగించారు. ఈ శాటిలైట్ తీసుకెళ్లిన పేలోడ్ అంతరిక్ష పర్యావరణ డేటా సేకరణ, ఇంటర్ శాటిలైట్ లేజర్ నెట్ వర్కింగ్ టెస్టుల కోసం ఉపయోగించే ఉపగ్రహాలు ఉన్నాయి. 2019 నుంచి హయాంగ్ 15 రాకెట్లను సముద్రంలో నౌకలపై నుంచి విజయవంతంగా లాంచ్ చేసింది. వాటిలో 89 శాటిలైట్లు తీసుకెళ్లారు. స్మార్ట్ డ్రాగన్-3 డిప్యూటీ చీఫ్ డిజైనర్ లియు వీ, హైయాంగ్ సమీపంలోని నీటిపై నుంచి ఇది తక్కువ వంపు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఫస్ట్ రాకెట్ అని చెప్పారు. 

Also Read: నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్..

Advertisment
తాజా కథనాలు