BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు.

New Update
libya

libya

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్న ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు. పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడుగురు వలసదారులు దాదాపు ఆరు రోజుల పాటు సముద్రం మధ్యలో ఉన్నారు. చివరకు లిబియా దేశ అధికారులు వారిని రక్షించారు. 

Advertisment
తాజా కథనాలు