Russia: నాటో vs రష్యా ..ఎస్టోనియాలోకి యుద్ధ విమానాలు..ఉద్రిక్తత
నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈనెలలో ఇలా జరగడం ఇది మూడోసారి.
నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈనెలలో ఇలా జరగడం ఇది మూడోసారి.
రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్ కామ్చాట్స్కీ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని తర్వాత మరోసారి 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
రష్యా విపక్ష ఉద్యమనేత అలెక్సీ నావల్నీ(47) గతేడాది ఫిబ్రవరిలో జైల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తాజాగా నావల్నీ భార్య యూలియా నావల్నాయ కీలక విషయాన్ని వెల్లడించారు. తన భర్త విష ప్రయోగం వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో కూటమి దేశాలకు సంచలన అల్టిమేటం జారీ చేశారు. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అందుకు నాటో సభ్యదేశాలు కొన్ని షరతులను పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇటీవల ఇక్కడ 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రష్యా తన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉందని, అది విజయవంతం అయిన తర్వాత రష్యాలోని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని రష్యా అధికారులు తెలిపారు.