/rtv/media/media_files/2025/09/19/nato-2025-09-19-22-46-04.jpg)
మూడేళ్ళుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ ఎవ్వరి మాటా వినకుండా మోనార్క్ లా ఉన్న రష్యా ఇప్పుడు నాటో దేశాలపై పడింది. ఆయా దేశాల్లో తన యుద్ధ విమానాలను తిప్పుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈరోజు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈనెలలో ఇలా జరగడం ఇది మూడోసారి. దీంతో నాటో యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితు ఏర్పడ్డాయి. దీని తరువాత పోలాండ్, రుమేనియాల్లోకి కూడా రష్యా డ్రోన్లు చొరబడ్డాయని ఎస్టోనియా అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికి నాలుగుసార్లు..
ఈరోజు తెల్ల వారు ఝామున రష్యన్ జెట్ లు ఎన్టోనియా గగనతలం ఆంక్షలను ఉల్లంఘించాయి. మాస్కో కింజాల్ హైపర్సోనిక్ క్షిపణిని మోసుకెళ్లగల భారీ ఇంటర్ సెప్టర్లు అయిన MiG-31లు ఎస్టోనియా రాజధాని టాలిన్ సమీపంలో ఎగిరి దాదాపు 12 నిమిషాల పాటు ప్రదక్షిణలు చేసాయి. వాటికి ఇటాలియన్ F-35 ఎదురవడంతో ...వెనక్కు మళ్ళాయి. రష్యన్ జెట్ లకు ఎప్పటికప్పుడు నాటో సమాధానం ఇస్తూనే ఉంది. NATO వెంటనే స్పందించి రష్యన్ విమానాన్ని అడ్డుకుంది" అని NATO ప్రతినిధి అల్లిసన్ హార్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది రష్యన్ నిర్లక్ష్య ప్రవర్తనకు, NATO యొక్క ప్రతిస్పందించే సామర్థ్యానికి మరో ఉదాహరణ అని చెప్పారు.
పోలాండ్, రుమేనియాలపై కూడా..
ఈ ఏడాదిలో రష్యా నాలుగుసార్లు ఎస్టోనియా గగనతలం రూల్స్ ను అతిక్రమించిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. రష్యా సరిహద్దులు, దురాక్రమణ రోజురోజుకూ పెరుగుతోందని...ఇది రాజకీయ, ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తోందని నాటో అధికారులు అంటున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా రష్యా చర్యలను ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన రెచ్చగొట్టడం అని బ్లాక్ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ అన్నారు. రష్యాకు ధీటుగా EU సభ్య దేశాల రక్షణను బలోపేతం చేస్తూనే ఉంటుందని చెప్పారు. పోలాండ్ లో రాత్రిపూట డజనుకు పైగా రష్యన్ డ్రోన్లు తన సరిహద్దును దాటాయని, కొన్ని ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు కీలకమైన లాజిస్టిక్స్ హబ్ అయిన ర్జెస్జో వైపు వెళుతున్నాయని తెలిపారు. నాటో మిత్ర దేశాల మద్దతుతో పోలిష్ దళాలు చాలా డ్రోన్లను కూల్చి వేశారు. అలాగే మరోవైపు రొమేనియా కూడా పదే పదే గగనతల ఉల్లంఘనను ఎదుర్కొంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే అందరినీ రెచ్చగొడుతున్నారని యూరోపియన్ నేతలు అంటున్నారు. అయితే తాము ఎక్కడా తగ్గేలే లేదని...వారికి ధీటుగా సమాధానంచెబుతామని చెప్పారు.