BIG BREAKING: ఆ దేశంలో మళ్లీ భారీ భూకంపం.. మరికొన్ని గంటల్లో సునామీ.. హెచ్చరికలు జారీ!

రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇటీవల ఇక్కడ 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. ఈ క్రమంలో  జపాన్, యునైటెడ్ స్టేట్స్, హవాయి, చిలీ, కోస్టా రికా ఇతర పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అయితే ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి ఎవరికి ఏం కానట్లు తెలుస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు