Navalny: పుతిన్‌కు బిగ్‌ షాక్‌.. విష ప్రయోగం వల్లే నావల్ని మృతి.. వెలుగులోకి సంచలన నిజాలు

రష్యా విపక్ష ఉద్యమనేత అలెక్సీ నావల్నీ(47) గతేడాది ఫిబ్రవరిలో జైల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తాజాగా నావల్నీ భార్య యూలియా నావల్నాయ కీలక విషయాన్ని వెల్లడించారు. తన భర్త విష ప్రయోగం వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

New Update
Alexei Navalny's widow says lab reports show her husband was poisoned

Alexei Navalny's widow says lab reports show her husband was poisoned

రష్యా(russia) అధ్యక్షుడు పుతిన్(Putin) ప్రత్యర్థి, విపక్ష ఉద్యమనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) (47) గతేడాది ఫిబ్రవరిలో జైల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆయనకు విష ప్రయోగం ఇచ్చి కావాలనే హత్య చేశారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా నావల్నీ భార్య యూలియా నావల్నాయ కీలక విషయాన్ని వెల్లడించారు. తన భర్త విష ప్రయోగం వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. నావల్నీ భౌతికకాయం నుంచి సేకరించిన శాంపిల్స్‌పై రెండు వేర్వేరు ప్రయోగశాలల్లో టెస్టులు జరిగినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో నావల్నీపై విష ప్రయోగం జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?

Alexei Navalny's Widow Says About Lab Reports Her Husband

'' నావల్నీ భౌతికకాయం నుంచి శాంపిల్స్‌ సేకరించి విదేశాలకు తరలించాం. వేర్వేరు దేశాల్లో రెండు ప్రయోగశాలలు ఈ నమునాలను పరీక్షించాయి. ఆయన విష ప్రయోగం వల్లే చనిపోయినట్లు రెండు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. రాజకీయ కారణాల వల్ల రిపోర్ట్స్‌ బయటకు రాలేదు. వాటిని బయటపెట్టాలని డిమాంట్ చేస్తున్నాను. పుతిన్‌కు సపోర్ట్‌ ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉన్నంతవరకు ఆయన్ని అడ్డుకోవడం కుదరదు. నావల్నీపై విష ప్రయోగం చేసి హత్య చేశారు. ఈ నిజం ప్రపంచాని తెలియాలని'' యూలియా అన్నారు. 

Also Read: ఇజ్రాయెల్‌ చేతుల్లోకి గాజా.. తరలిపోతున్న పాలస్తీనియులు

ఇదిలాఉండగా గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను నావల్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్పడ్డ అవినీతి, స్కామ్‌లను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే తీవ్రవాద సంబంధిత అభియోగాలపై నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఖార్ప్ అనే సిటీలో ఆయన జైల్లో ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. నావల్నీ హత్య వెనుక పుతిన్ హస్తం ఉన్నట్లు అప్పట్లో వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. 2020లో కూడా నావల్నీపై విషప్రయోగం జరిగింది. అయితే జర్మనీలో ఆయన దీర్ఘకాలం చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు.

Also Read: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ

Advertisment
తాజా కథనాలు