Russia-Ukraine War: ఉక్రెయిన్పై భీకర దాడులు.. 300కుపైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ఉక్రెయిన్పైకి 300లకు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో చాలావరకు నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.