/rtv/media/media_files/2026/02/08/4-indian-students-injured-after-knife-attack-in-russian-college-2026-02-08-07-06-40.jpg)
4 Indian Students Injured After Knife Attack In Russian College
రష్యాలో మరోసారి దారుణం జరిగింది. ఓ యూనివర్సిటీలోని విద్యార్థుల హాస్టల్‌లో కత్తిపోట్ల దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. బాష్కోర్తోస్థాన్ రిపబ్లిక్‌లోని యూఫాలో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడి హాస్టల్‌లోకి దూసుకొచ్చిన ఓ యువకుడు అక్కడున్న విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు.
Also Read: కుప్పకూలిన భారీ ఊయల.. 13 మందికి గాయాలు!
ఇందులో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. అలాగే అతడు తనకు తానే కత్తితో గాయపర్చుకున్నాడు. చివరికి క్షతగాత్రులతో పాటు నిందితుడిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం సైతం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధితుల్లో నలుగురు భారతీయులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనపై స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని చెప్పింది. భారత కాన్సులేట్ అధికారులు యూనివర్సిటీకి వెళ్లారని.. బాధిత విద్యార్థులకు సాయం అందిస్తారని స్పష్టం చేసింది.
#BREAKING | 4 Indian Students Injured After Knife Attack In Russian College: Embassy
— NDTV (@ndtv) February 8, 2026
NDTV's @VishalV054 Reports pic.twitter.com/2BCyb0pxtc
Also Read: రష్యా లో దారుణం.. దుండుగుడు కత్తితో దాడి.. నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Follow Us