Russia: భారత్‌కు షాక్‌.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.

New Update
Putin

Putin

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్గంలో చమురు రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా  బ్యారెల్‌కు 15 నుంచి 30 డాలర్ల వరకు తక్కువ ధరకే భారత్‌కు విక్రయించేది.

 కానీ ఇప్పుడు అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు 2 నుంచి 5 డాలర్లు  అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్లు ఉంది. దీంతో రష్యా ఇకనుంచి భారత్‌కు సుమారు 92 నుంచి 95 డాలర్ల వరకు చమురును విక్రయించే ఛాన్స్ ఉంది. దీంతో ఇంధన ధరలు భారత్‌లో పెరగనున్నాయి. 

Also Read: రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు అమెరికా పర్మిషన్ ? ఇందులో వాస్తవం ఎంత..

డిస్కౌంట్ నుంచి ప్రీమియంకు ఎందుకు ?

ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. భారత్‌కు చమురు అవసరాల్లో దాదాపు 50 శాతం ఈ రూట్‌ నుంచే వస్తోంది . అయితే ఇప్పుడు ఆ సరఫరా ఆగిపోయింది. దీంతో ఇండియన్ రిఫైనరీలు ప్రత్యామ్నాయం కోసం రష్యా వైపు చూస్తున్నాయి. క్రమంగా చమురుకు డిమాండ్ విపరీతంగా పెరగుతోంది. అందుకే రష్యా తన పాత డిస్కౌంట్లను రద్దు చేసింది. వ్యూహాత్మకంగా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకే చమురును విక్రయిస్తోంది. 

దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగనున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ (LPG) ధరలు కూడా 7 శాతం పెరిగాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. చివరికి నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు రష్యా నుంచి చమురు సేకరించే మార్గమే కనిపిస్తోంది. 

Also Read: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?

రష్యాలోని బాల్టిక్ ఓడరేవులలో చమురు ధర కొంచెం చౌకగా ఉన్నప్పటికీ.. భారత్‌కు వచ్చే సమయానికి దాని ధర అమాంతం పెరుగుతుంది. యుద్ధం వల్ల.. చమురు నౌకలు 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ద్వారా అంటే ఆఫ్రికా కింద ఉన్న మార్గం ద్వారా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. సముద్ర బీమా, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. 

Advertisment
తాజా కథనాలు