/rtv/media/media_files/2026/02/12/max-app-2026-02-12-12-42-23.jpg)
రష్యా గవర్నమెంట్ ఆ దేశంలోని సోషల్ మీడియా రంగంలో కీలక మార్పులు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై పుతిన్ సర్కార్ బ్లాక్ చేసింది. విదేశీ యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ టెక్నాలజీ ప్రోత్సహించడానికి రష్యా తన స్వదేశీ యాప్ మ్యాక్స్‌ను అధికారికంగా రంగంలోకి దించింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్పై పూర్తి ప్రభుత్వ నియంత్రణ ఉంచడంలో రష్యా ఇప్పుడు చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల సరసన చేరింది. భద్రత పేరుతో ప్రజల భావప్రకటన స్వేచ్ఛ, గోప్యతను రష్యా తన గుప్పిట్లోకి తీసుకుంటోందనే విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
🚨 BREAKING: Russia has officially blocked WhatsApp nationwide and is urging citizens to move to the state-backed messaging platform MAX. 🇷🇺
— Immortal Faith (@immorfaith) February 12, 2026
Another major step toward tighter digital control and a reminder of how geopolitics is reshaping the global internet. 👀 pic.twitter.com/fJySqtfqdp
రష్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ ప్రకారం.. ఇంటర్నెట్ భద్రత, డేటా సెక్యురిటీని కాపాడటమే దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా సంస్థ యాప్‌లపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న రష్యా, ఇప్పుడు వాట్సాప్‌ను కూడా జాబితాలో చేర్చింది. 2025లోనే వాట్సాప్ కాల్స్‌పై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఇటీవల టెలిగ్రామ్ సర్వీసులపై కూడా లిమిట్స్ విధించడం గమనార్హం.
రష్యాకు చెందిన టెక్ దిగ్గజం VK ఈ 'MAX' యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంది. ఇకపై రష్యాలో అమ్మే అన్ని స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలలో ఈ యాప్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం చాటింగ్ యాప్ మాత్రమే కాదు. ప్రభుత్వ సేవలు, ఆన్లైన్ పేమెంట్స్, ఇతర సివిల్ సర్వీసులకు వన్-స్టాప్ ఫ్లాట్‌ఫాంగా ఉండబోతోంది. బాట్లు, స్పామ్ సందేశాలను అరికట్టడానికి యూజర్ల గుర్తింపును ఈ యాప్‌లో దాచడం సాధ్యం కాదు.
సెక్యురిటీపై ఆందోళనలు
అయితే, ఈ మార్పు టెక్ నిపుణుల్లో కొత్త చర్చకు దారితీసింది. వాట్సాప్‌లో ఉండే అత్యంత కీలకమైన సెఫ్టీ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ MAX యాప్‌లో లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ సెక్యురిటీ సంస్థలు కోరితే యూజర్ల డేటా వారికి అందజేస్తామని ఈ యాప్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే, యూజర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్పై ప్రభుత్వ నిఘా ఉండే అవకాశం ఉంది. రష్యా ప్రజలు ఇకపై తమ డిజిటల్ జీవితాన్ని సర్కార్ నిఘా నీడలోనే గడపాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.
Follow Us