/rtv/media/media_files/2026/02/09/putin-2026-02-09-20-12-07.jpg)
Putin Named 1,005 Times In Epstein Files
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసి పత్రాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ పుతిన్‌ను కూడా కలిసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆ డాక్యుమెంట్ పేజీల్లో వెల్లడయ్యింది. అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఐక్యరాజ్యసమితిలో మాజీ రష్యా రాయబారి విటాలీ చుర్కిన్, ఇతర కీలక రష్యన్ అధికారులను సంప్రదించడానికి ఎప్‌స్టీన్ యత్నించినట్లు తెలుస్తోంది.
Also Read: వామ్మో.. ఎప్‌స్టీన్ మరణానికి ఒకరోజు ముందే అది జరిగిందా ? వెలుగులోకి సంచలన నిజాలు
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్ పేజీల్లో ఏకంగా 1005 సార్లు పుతిన్ పేరు ప్రస్తావించినట్లు సమాచారం. 2018 జూన్ 2018లో ఎప్‌స్టీన్.. సీనియర్ నార్వేజియన్ నేత, అప్పటి కౌన్సిల్ ఆఫ్ యూరప్ సెక్రటరీ జనరల్ థోర్బ్జోర్న్ యెగెలాండ్‌కు ఓ ఇమెయిల్ పంపాడు. లావ్‌రోవ్ తనతో మాట్లాడగలడని పుతిన్‌కు మెసేజ్ పంపాలని అభ్యర్థించాడు. గతంలో విటాలీ చుర్కిన్ ద్వారా మాట్లాడానని.. కానీ విటాలీ మరణించాక కొత్త మార్గం వెతుక్కున్నట్లు ఎప్‌స్టీన్ రాశాడు.
ఎప్‌స్టీన్ ఎప్పుడైనా పుతిన్‌ను కలిశాడా లేదా అనేది పత్రాలు స్పష్టం చేయలేదు. కానీ ఈమెయిల్స్‌లలో ఎప్‌స్టీన్ పుతిన్‌ను కలవబోతున్నానని లేదా ఆహ్వానం అందుకున్నానని పేర్కొన్నాడు. కానీ దీనికి అధికారిక ధృవీకరణ లేదు. ఈ మిలియన్ల పేజీల పత్రాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు కనీసం 1005 సార్లు ప్రస్తావించారు. అంతేకాదు రష్యన్ నిఘా సంస్థలతో ఎప్‌స్టీన్‌కు ఉన్న సంబంధాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అన్నారు. కానీ ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.
Follow Us