Cashless Treatment : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అండగా కేంద్రం..ఇకపై రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు కేంద్రం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.