Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి!
గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు.