తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని అరికట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలని నితిన్ గడ్కరీ అన్నారు. తాను విదేశాల్లో జరిగే మీటింగ్స్‌కు వెళ్లనప్పుడు రోడ్డు ప్రమాదాల విషయం చర్చకు వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.

New Update
NITIN

దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో మరోసారి స్పందించారు.  గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని అరికట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. తాను విదేశాల్లో జరిగే మీటింగ్స్‌కు వెళ్లనప్పుడు రోడ్డు ప్రమాదాల విషయం చర్చకు వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. 

Also Read: తెలంగాణలో 60 వేలమంది ప్రేమికులు మిస్సింగ్.. వెలుగులోకి సంచలన నిజాలు

'' కేంద్ర రవాణాశాఖ మంత్రిగా నేను ప్రమాణం చేసినప్పుడు కనీసం 50 శాతం ప్రమాదాలను కట్టడి చేస్తానని లక్ష్యంగా పెట్టుకున్నాను. తగ్గించడం సంగతి అటుంచితే రోజురోజుకు యాక్సిడెంట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. భారతీయుల్లో మార్పు రావాలి. ట్రాఫిక్ నిబంధనలను ప్రతీఒక్కరు గౌరవించినప్పుడే ప్రమాదాలను నియంత్రించవచ్చు.  

Also Read: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్‌కు ముందు కీలక ప్రకటన

ఏడాదికి సగటున 1.78 లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో 60 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల వయసున్నవాళ్లే. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయి. అక్కడ ప్రతీ సంవత్సరం 23 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు (18 వేలు), మహారాష్ట్ర (15 వేలు), మధ్యప్రదేశ్‌ (13 వేలు) ఉన్నాయని'' నితిన్‌ గడ్కరీ వివరించారు. 

Also Read: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

అలాగే రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ట్రక్కులను నిలపివేయడం వల్ల ప్రమాదలకు ప్రధాన కారణమవుతోందని అన్నారు. దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను రూపొందించాలని ఇప్పటికే తాము ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. బస్సులకు కిటికీ పక్కన కచ్చితంగా ఒక సుత్తిని ఏర్పాటు చేయాలని, అత్యసర సమయాల్లో అద్దాలు పగలగొట్టి బయటకు వెళ్లేందుకు వీలుగా వీటిని డిజైన్ చేయాలని సూచించినట్లు చెప్పారు.

Also Read: మనోజ్‌కే మంచు లక్ష్మీ సపోర్ట్.. తండ్రి, సొంత తమ్ముడిని కాదని..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు