/rtv/media/media_files/2025/04/29/1bsS6yCsKRZMc8Gncn9T.jpg)
Road Accident
ప్రతి రోజూ మనం చూసే రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నాయి. వేగంగా వాహానాలపై వెళ్లడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్యాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఈ దుర్ఘటనలు కేవలం ప్రాణాలను మాత్రమే కాదు.. అనేక జీవితాలను, భవిష్యత్తులను నాశనం చేస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ఇలాంటి విషాదాలు జరగకుండా కొంతవరకు అరికట్టవచ్చు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని సాధ్యం చేయగలం. అయితే తాజాగా మరో రోడ్డు ప్రమాదం ఓ ఇంటి విషాదాన్ని నిప్పింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ట్యాంకర్ అకస్మాత్తుగా అదుపుతప్పి..
రంగారెడ్డి జిల్లా(Rangareddy District) లోని చేవెళ్ల మండలం బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఈ రోజు ఉదయం చేవెళ్ల బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ అకస్మాత్తుగా అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకూతుళ్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రోడ్డుపై రక్తపు మడుగు ఏర్పడింది.
ఇది కూడా చదవండి: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్