/rtv/media/media_files/2025/03/09/ir8fVNDk13tkAebLPDok.jpg)
Road Accident
Cashless Treatment : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు కేంద్రం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 'క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీం-2025' కింద మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రమాదం జరిగిన ఏడు రోజుల వరకు ఈ సేవలు పొందవచ్చు.
ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు త్వరగా చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు ఈ సేవలు ఎంతో ఉపకరిస్తాయి. సోమవారం నుంచే ఈ సేవలు అమల్లోకి వచ్చినట్లు అందులో ప్రకటించింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ పథకానికి ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’గా నామకరణం చేసింది. మోటారు వాహనం కారణంగా ఎలాంటి రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజులదాకా ఈ సేవలు పొందవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో సూచించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకురాగానే వైద్య సేవలు ప్రారంభించాలి. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోతే, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలి. రవాణా సౌకర్యాన్ని కూడా ఆసుపత్రే ఏర్పాటు చేయాలి. బాధితుడిని డిశ్చార్జ్ చేసిన తర్వాత, ఆసుపత్రి బిల్లును పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read : ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అరెస్టు!
Follow Us