అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లేది ఆ కేసులకే.. రిపోర్టులో సంచలన విషయాలు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో గర్భిణీలను, రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్లని ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులకే అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 7.7 లక్షల ఎమర్జెన్సీ కేసులకు అంబులెన్సులు వెళ్లాయని పేర్కొంది. By B Aravind 02 Dec 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో అందరినీ ఆదుకునేది 108 అంబులెన్స్. అయితే రాష్ట్రంలో గత ఏడాది కాలంలో గర్భిణీలను, రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్లని ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులకే అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు గర్భిణీలను ఎమర్జెన్సీ సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులే 20 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇక రోడ్డు ప్రమాదాల కేసులు 13 శాతం ఉన్నట్లు తెలిపింది. Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు నెలకు 54 వేల ఎమర్జెన్సీ కేసులు మొత్తానికి గత ఏడాది కాలంలో 108 అంబులెన్స్‌లు ఏకంగా 7.7 లక్షల ఎమర్జెన్సీ కేసులకు వెళ్లినట్లు రిపోర్టులో తేలింది. ప్రెగ్నెన్సీ, రోడ్డు ప్రమాదాల కేసులు మాత్రమే కాకుండా.. పైనుంచి పడిపోవడం, కాలిపోవడం, కత్తిపోట్లకు గురవ్వడం అలాగే జ్వరం, ఇతర ఇన్‌ఫెక్షన్ కేసులు టాప్ 5 ఎమర్జెన్సీ కేసుల్లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నెలకు సగటున 54 వేల ఎమర్జెన్సీ కేసులకు అంబులెన్స్ సేవల వినియోగం జరిగిందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. నెలకు దాదాపు 7 వేల రోడ్డు ప్రమాదాల కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఈ జిల్లాల్లకే అంబులెన్స్‌ల వినియోగం ఎక్కువైంది. ఇందులో ముఖ్యంగా టూ వీలర్ యాక్సిడెంట్‌లే దాదాపు 85 శాతం ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయని, పట్టణాల్లో 39 శాతం, అలాగే గిరిజన ప్రాంతాల్లో 8 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. Also Read: పార్లమెంట్‌లో ది సబర్మతి రిపోర్ట్.. వీక్షించనున్న ప్రధాని మోదీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉండేవారు రోడ్డు ప్రమాదాలకు, గర్భిణీల కోసం, ఇతర ఎమర్జె్న్సీలకు ఎక్కువగా అంబులెన్స్‌లపైనే ఆధారపడతారని తెలంగాణ ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి లా ఖలీద్ తెలిపారు. అందుకే ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తుంటాయని పేర్కొన్నారు. వారంలో ఆదివారం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 16.5 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగితే, గురువారం 14.6 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని పేర్కొంది. పట్టణాల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పడు అక్కడికి అంబులెన్స్‌లు రావడానికి 12 నిమిషాల్లో వస్తుండగా.. ఇక గ్రామీణ, గిరిజన తండాలకు 15 నుంచి 18 నిమిషాల్లో వస్తున్నాయని లా ఖలీద్ తెలిపారు. Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే! Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు #telangana #telugu-news #108-ambulance #road-accidents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి