Accident : పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి..!
జనగామలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. రామవరానికి చెందిన శ్రవణ్(29), శివ(27) ఉప్పల్ వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందరు.