Ap Road Accidents: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పలు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటన పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పై మోటకంపల్లి కొత్తకోట ఫ్లైఓవర్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో లారీలోని ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సహాయంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహకారంతో మృత దేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ... కాకినాడలో మరో ప్రమాదం.. ఇదే రోజు కాకినాడ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, లారీ, బస్సు మూడూ ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తుని మండలం తేటగుంట దగ్గర హైవేపై చోటుచేసుకుంది. అయితే బస్సులో కోనసీమ జిల్లాకు చెందిన 40 మంది యాత్రికులు ఉన్నారు. వీరంతా బస్సులో కాశీ యాత్రకు బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. తేటగుంట వద్ద లారీ సడన్ బ్రేక్ కొట్టడంతో.. వెనుక ఉన్న బస్సు లారీని ఢీకొట్టింది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. Also Read: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా? Also Read: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు చలిగాలులు: వాతావరణ కేెంద్రం