Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు.పూర్తి వివరాలు కథనంలో.

New Update
accident (1)1

Big Breaking: అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండ మండలం కేఎన్‌ పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన 10 మందికి పైగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

Also Read: Ap: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!

టీటీ వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు మడకశిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న టీటీ వాహనం వేగంగా ఢీకొట్టింది.దీంతో టీటీ వాహనంలో ఉన్న ప్రేమ్ కుమార్ (30), అతర్వా (2),డ్రైవర్‌,మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతమైన వింత.. అస్సలు మిస్ అవ్వకండి..!

మరో  10 మందికి తీవ్ర గాయాలు కావడంతో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో  పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఆసుపత్రి వైద్యులు  తెలిపారు. దీంతో వారిని హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు అంబులెన్స్ వాహనాల్లో తరలిస్తున్నారు.

Also Read: థంబ్ నెయిల్స్‌తో విసిగించేవారి ఆటకట్టు..రూల్స్ కఠినం చేయనున్న యూట్యూబ్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Asteroid: పోతారు.. మొత్తం పోతారు..! దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

యాత్రికుల పూర్తి వివరాలు

1.కేంపన్న,కేంచమ్మ,ప్రేమ్ కుమారి(మృతి),అత్వార్..(మృతి.), గీత లక్ష్మి,  సుజాతమ్మ, గిరిజమ్మ,  నాగమణి.ఉష, అమాజఅమ్మ, శ్రీదేవి,  శ్వేత,  డ్రైవర్ (30)(మను).. తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందినవారు... ప్రేమ్ కుమార్.(30),అతర్వా (2) రత్నమ్మ (70)గా పోలీసులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు