Road Accident: నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైయ్యారు. ఈ హృదయ విదారక ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయ ఎర్రారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దేవరకొండలోని ఓ దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read: కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ..కొత్త వేరియంట్ గుర్తింపు ప్రాణం తీసిన డీసీఎం: స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలనుపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటుచేసుకుందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి మరణించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం Also Read: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు