ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ కిందపడి టైర్ల మధ్యలో బాలిక హర్ష శ్రీ (13) ముద్దై దుర్మరణం చెందింది. ఈ విషయాన్ని డ్రైవర్ గమనించేలోపు లారీ టైర్లు హర్షశ్రీపై నుంచి కొంత దూరం వరకు రోల్ అయివెళ్లాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు ఇరుముడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచిలుక గ్రామానికి చెందిన 13 ఏళ్ల హర్షశ్రీ వైరా గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. హర్ష శ్రీ తండ్రి చెరుకూరి వీరబాబు ఇటీవల అయ్యప్ప మాల ధరించగా.. తాజాగా ఇరుముడి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హర్షశ్రీ మంగళవారం తన ఇంటికి వెళ్లింది. ఇక ఇరుముడి కార్యక్రమం అనంతరం మరుసటి రోజు బుధవారం తన మేనమామ శ్రీకాంత్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ కిందపడి హర్ష శ్రీ (13) టైర్ల మధ్యలో ముద్దై దుర్మరణం చెందింది. ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాన్ని డ్రైవర్ గమనించేలోపు లారీ టైర్ల మధ్యలో హర్షశ్రీ ఇరుక్కుని నుజ్జు నుజ్జయింది. హర్షశ్రీ మృతితో స్వస్థలం కోయచిలుక గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి. హర్షశ్రీ మృతదేహాన్ని చూచి ఆ బాలిక తల్లీ, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ఇక కూతురి మరణ వార్త విన్న తండ్రి శబరిమల మార్గమధ్యంలో కుప్పకూలారు. అనంతరం మార్గమధ్యం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.