KKR VS RCB: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే చిక్కొడుతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు.
ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. ఈ సీజన్లో అయినా కప్ కొట్టాలని ఓ వీరాభిమాని వినూత్న ప్రయత్నం చేశాడు. కుంభమేళాలో జెర్సీకి గంగా స్నానం చేయించి, ఈ తర్వాత పూజలు నిర్వహించాడు. ఈ సారి కప్ పక్కా ఆర్సీబీదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు.
ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు.
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్ కోసం ఇప్పటికే మేనేజ్మెంట్ కోహ్లీతో చర్చించగా సారథ్యం స్వీకరించేందుకు విరాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చెన్నైప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో తట్టుకోలేక ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదని హర్భజన్ చెప్పినట్లు ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేశాడు.