RCB VS MI: దుమ్ముదులిపిన ఆర్సీబీ.. ముంబై ముందు భారీ టార్గెట్‌

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. 

New Update
RCB

RCB

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. 

Also Read: ద్రవిడ్‌లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్‌ షాకింగ్ కామెంట్స్!

తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఫిలిప్‌ సాల్ట్ 4 పరుగులు చేసి రెండో బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన విరాట్ కోబ్లీ దూకుడుగా ఆడాడు. 67 పరుగులు చేశాడు. విల్ జాక్స్ చేసిన 5 ఓవర్లలో కోహ్లీ ఫోర్‌ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. ఇక చివరగా 20వ ఓవ‌ర్లో.. జితేశ్ లాంగాన్‌లో క‌ళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో.. ముంబయి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది ఆర్సీబీ. 

Also Read: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఇషాంత్ శర్మకు భారీ జరిమానా

Also Read: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు