RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. చాలా కష్టపడి ఆడిన ముంబయ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడంతో ఆర్సీబీకి విజయం దక్కింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

RCB vs MI

మ్యాచ్ అంటే ఇలా జరగాలి అన్నట్టు అయింది నిన్న ముంబయ్, ఆర్సీబీల మధ్య జరిగిన మ్యాచ్. బెంగళూరు మొదటి బ్యాటింగ్ చేసి ముంబయ్ కు 222 లక్ష్యం ఇచ్చింది. టార్గెట్ ఛేదనలో 12 ఓవర్లకు ముంబయ్ స్కోరు కేవలం 99 పరుగులు. అప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకేముందిలే బెంగళూరు గెలిచేస్తుంది అనుకున్నారంతా. 8 ఓవర్లలో 123 పరగులు చేయాలి అప్పటికి...చాలా కష్టం అనుకున్నారు. కానీ ముంబయ్ బ్యాటర్లలో తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా చెలరేగిపోయారు. 33 బంతుల్లో 89 పరుగులు చేశారు. దీంతో ముంబయ్ గెలుస్తుంది అని అనుకున్నారు అంతా. కానీ ఆర్సీబీ...ముంబయ్ కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చివర్లో చకచకా వికెట్లు తీసి మ్యాచ్ ను సొంతం చేసుకుంది.  12 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. 

టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేసి..

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఫిలిప్‌ సాల్ట్ 4 పరుగులు చేసి రెండో బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన విరాట్ కోబ్లీ దూకుడుగా ఆడాడు. 67 పరుగులు చేశాడు. విల్ జాక్స్ చేసిన 5 ఓవర్లలో కోహ్లీ ఫోర్‌ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. ఇక చివరగా 20వ ఓవ‌ర్లో.. జితేశ్ లాంగాన్‌లో క‌ళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో.. ముంబయి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది ఆర్సీబీ.  

 today-latest-news-in-telugu | IPL 2025 | rcb | match

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Advertisment
తాజా కథనాలు