IPL 2025: చితక్కొడుతున్న ఆర్సీబీ..సాల్ట్ హాఫ్ సెంచరీ

ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే చిక్కొడుతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

author-image
By Manogna alamuru
New Update
ipl

RCb Batter salt half century

అసలు అవ్వదనుకున్న మ్యాచ్ వరుణుడు దయ వల్ల జరుగుతోంది. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. ఛేదనకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మొదట నుంచి దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్స్ చెమటలు పట్టిస్తున్నారు. ఓపెనర్లుగా దిగిన విరాట్  కోహ్లీ, సాల్ట్ లు వికెట్ కోల్పోకుండా..నిలకడగా ఆడుతున్నారు. ఈక్రమంలో సాల్ట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ ప్రస్తుతం 34 పరుగుల దగ్గర ఉన్నాడు. 

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  20 ఓవర్లకు గానూ 8  వికెట్ల నష్టానికి 174  పరుగులు చేసింది.  ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా టీమ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన   క్వింటన్‌ డికాక్‌(4) పరుగులకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

దీంతో ఆ తరువాత సునీల్‌ నరైన్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు కెప్టెన్ అజింక్య రహానే.  మూడు ఓవర్లకు 9 పరుగులు చేసిన కేకేఆర్ టీమ్ ఆ తరువాత ఆరు ఓవర్లలో ఏకంగా 90 పరుగులు బాదింది. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 25 బంతుల్లో రహానే హాఫ్‌ సెంచరీ చేశాడు. పది ఓవర్లు పూర్తి అయ్యేసరికి కేకేఆర్ 100 పరగులు మార్క్ దాటింది.   దీంతో స్కోరు 200పైగాపనే వెళ్తుందని అంతా భావించారు. ఇంతలోనే ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు.  వరుస వికెట్లతో కేకేఆర్ వికెట్ల పతనాన్ని శాసించారు.  రహానే,  సునీల్‌ నరైన్‌  అందించిన జోష్ ను మిడిలార్డర్ ఆటగాళ్లు కొనసాగించలేకపోయారు.  రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్‌  లాంటి హిట్టర్స్ కూడా త్వరత్వరగానే ఔటయ్యారు. లేదంటే కేకేఆర్ భారీ స్కోర్ చేసేదనే చెప్పాలి.  

today-latest-news-in-telugu | ipl-2025 | rcb

Advertisment
తాజా కథనాలు