Glenn Maxwell: ఆర్సీబీ రిలీజ్ చేయడంపై మ్యాక్స్‌వెల్ సంచలన కామెంట్స్! ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు. By srinivas 06 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Glenn Maxwell: ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనను రిటైన్ చేసుకోకపోవడంపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌కోచ్ ఆండీ ప్లవర్, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ఈ విషయం గురించి ముందే తనతో మాట్లాడారని చెప్పాడు. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారని, ఈ విషయంలో తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపాడు. కానీ 2021 నుంచి టీమ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను బెంగళూరు రిటైన్ చేసుకోకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. Aslo Read: 'భీమ్లా నాయక్' డైరెక్టర్ లాంచ్ చేసిన 'లగ్గం టైం' ఫస్ట్ లుక్..! జట్టు వ్యూహంతోనే ఈ నిర్ణయం.. ‘నాతో జట్టు యాజమాన్యం మాట్లాడింది. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పారు. జట్టు వ్యూహం, రిజల్ట్ రాబట్టడానికి ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారనే విషయాలపై చర్చించాం. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను. ఆటగాళ్లతో చర్చించడానికి కొంత సమయం పడుతుందని నేను అర్థం చేసుకున్నా. ఆర్సీబీతో నా ప్రయాణం ముగిసిందని అనుకోవట్లేదు. మళ్లీ జట్టులోకి రావాలనుకుంటున్నా. ఇది గొప్ప ఫ్రాంఛైజీ. ఇన్నాళ్లు ప్రాతినిథ్యం వహించినందుకు సంతోషిస్తున్నా' అని చెప్పాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఔట్.. ఇక విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లు, రజత్ పాటిదార్ రూ. 11 కోట్లు, యశ్ దయాళ్ రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్ తోపాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను కూడా ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ వద్ద రూ.83 కోట్లు ఉండగా మూడు రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డ్‌లు ఉన్నాయి. ఇక మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డాలో నిర్వహించనుండగా.. మొత్తం 1574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులున్నారు. Also Read: సత్తా చాటిన భారత బాక్సర్.. WBF టైటిల్ కైవసం! #ipl-2025 #rcb #sports #glen-maxwell మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి