/rtv/media/media_files/2025/07/23/heavy-rain-in-the-next-few-hours-2025-07-23-13-58-38.jpg)
Heavy rain in the next few hours..
Rain Alert : తెలంగాణలో మరో కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు IMD ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
శ్రీశైలానికి భారీగా వరద
Srisailam Dam : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రభావం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి డ్యామ్‌లో చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 91,812 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇక అవుట్ ఫ్లో 1,14,709 క్యూసెక్కులుగా ఉంది.దీంతో ఒక స్పిల్‌వే గేట్ ఎత్తి 27,52 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎడమ గట్టు, కుడిగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడమగట్టు నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు నుంచి 31,870 క్యూసెక్కులు వరద దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 208.72 టీఎంసీల మేర నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
Also Read:BREAKING: వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించండి.. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు!