/rtv/media/media_files/2025/07/23/rain-alert-in-telangana-2025-07-23-12-52-23.jpg)
Rain Alert In Telangana
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ , జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్‌జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Pakistan: పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు
Droni Effect In Telangana - Rain Alert
బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు నీటిని అందించే మూసీ, ఈసీ నదుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే జంట జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జలాశయాల దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
Also Read: Fourth Test: ఇదైనా గెలుస్తారా..నాలుగో టెస్ట్ ఈరోజు నుంచే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. తాలిపేరుతో పాటు చింత వాగు, పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయానికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది.
Also Read : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద పరవళ్లు తొక్కుతూ ఉండటంతో దిగువ తేగడ వద్ద లో లెవల్ చప్టా నీటమునిగింది. వరద పరిస్థితిని ఏఈ సంపత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రామచంద్రాపురం, బత్తినపల్లి, బట్టి గూడెం తదితర గ్రామాల్లో వాగులు పొంగుతున్నాయి.
heavy-rain-alert-in-telangana | rain-alert | telangana rain alert | Rain Alert To Telangana | Rain Alert To Hyderabad | rain alert for hyderabad